Divitimedia
Andhra PradeshDELHIHyderabadInternational NewsLife StyleNational NewsPoliticsTelangana

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

ప్రభుత్వం ప్రజాసేవకే అంకితమై ఉంది : అశ్వనీవైష్ణవ్‌

✍️ న్యూఢిల్లీ – దివిటీ మీడియా (జూన్ 11)

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా అశ్వనీ వైష్ణవ్‌ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అంకితమై ఉందన్నారు. మొదటి కేబినెట్‌ సమావేశంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 3 కోట్ల ఇళ్ల నిర్మాణానికి తీసుకున్న నిర్ణయం పేదల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనమన్నారు. దేశ ప్రజలకు తమ ప్రభుత్వం నిరంతరం సేవ చేస్తూనే ఉంటుందన్నారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి బాధ్యతలు నిర్వర్తించే అవకాశమిచ్చిన ప్రధానమంత్రికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రిత్వశాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో పాటు ఈ శాఖకు అనుబంధంగా పనిచేసే మీడియా యూనిట్లు, ఇతర ప్రభుత్వ అధికారులు మంత్రి వైష్ణవ్‌ కు స్వాగతం పలికారు.

Related posts

ఎస్సీఅర్పీలు మరింత బాధ్యతగా పని చేయాలి

Divitimedia

శ్రీరామచంద్రుడి ఆలయాభివృద్ధిపై ‘తారకరాముడి’కి నిరసన సెగ

Divitimedia

విద్యార్థులకు ఘనస్వాగతం పలికిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment