గిరిజన రిజర్వేషన్లు తగ్గిస్తే ఉద్యమమే శరణ్యం
రిజర్వేషన్లపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి
✍️ దివిటీ మీడియా – కొత్తగూడెం (జూన్ 8)
గిరిజనులకున్న రిజర్వేషన్లు తగ్గిస్తే ఉద్యమించక తప్పదని, రిజర్వేషన్ల పరిరక్షణపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ కోరింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని స్థానిక కొత్తగూడెం క్లబ్ లో శనివారం జీఓ నెం.3, జీఓ.నెం.33 రిజర్వేషన్, 10 శాతం రిజర్వేషన్ సాధన కోసం ఆల్ ఇండియా బంజారా సేవాసంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి సభ్యులు జోగురాం, వైరా మాజీ ఎమ్మెల్యే చంద్రావతి, ఎఐబిఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బక్షీనాయక్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.10 శాతం రిజర్వేషన్ ఉంచాలని, గిరిజనులకు అన్యాయం చేసే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రిజర్వేషన్లు కొనసాగేలా న్యాయపరమైన చర్యలు తీసుకుని గిరిజన పక్షపాత ప్రభుత్వంగా ఉండాలని, లేనిపక్షంలో తండాల స్థాయి దాకా గిరిజన జాతులను జాగృతం చేసి దశలవారీ ఆందోళనకు పూనుకోవాలని ఐక్య బంజారాల సంఘం ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. టి ఎస్ టి టి ఎఫ్ వ్యవస్థాపక గౌరవాధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్, టి టి ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలకృష్ణ చౌహాన్, టి.సేవ రాష్ట్ర అధ్యక్షుడు హాతిరాంనాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్, అడ్వకేట్ శ్రీనివాస్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షుడు రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, నాగేశ్వరరావు, ఏజెన్సీ పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు లాల్ సింగ్, ఐక్య తల్లిదండ్రుల సంఘం ఉపాధి కల్పన అన్వేషణ విభాగం చైర్మన్ బాలు, పీఆర్టీయూ నాయకులు సర్కార్, హరి, రాందాస్, ఎల్.ఎస్.ఓ జిల్లా అధ్యక్షుడు మోహన్, మంగీలాల్ నాయక్, నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.