నిరుపేద మహిళలకు గొడుగుల పంపిణీ
✍️ దివిటీ మీడియా – సారపాక (జూన్ 8)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని ఐటీసీ పేపర్ పరిశ్రమ అనుభంద సేవాసంస్థ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ఆధ్వర్యంలో శనివారం 10మంది నిరుపేద చిరు వ్యాపారులకు నీడ కోసం గొడుగులు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వీధుల్లో పండ్లు, కూరగాయలు అమ్ముకునే మహిళలకు నీడనిచ్చే ఈ పెద్ద గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐటీసీ అధికారులు, రోటరీక్లబ్ ప్రతినిధులు మాట్లాడతూ అందరూ మంచి జీవనోపాధి పొందాలని, ఆ గొడుగులు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ప్రయోజనం పొందే మహిళలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీసీ పరిశ్రమ సారపాక యూనిట్ హెడ్ ప్రణవ్ శర్మ, రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్, రోటరీ సభ్యులు చెంగల్రావు, నాగమల్లేశ్వరరావు, డీవీఎం నాయుడు, కునిశెట్టి రాంబాబు, ఏసోబు, సుధాకరరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, చంద్రశేఖర్, ప్రతాప్, ఎమ్మెస్కే సంస్థ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.