ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కన్నుమూత
✍️ దివిటీ మీడియా – హైదరాబాదు (జూన్ 8)
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈనాడు గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందారు. రామోజీరావు మృతదేహాన్ని ఫిలింసిటీలోని ఆయన నివాసానికి తరలించారు. మీడియా రంగంలో అనేక సంచలనాలకు, వినూత్న విధానాలకు మారుపేరుగా, రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో పలు మార్పులకు కారకుడిగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు గడించారు. పలురంగాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. కొంతకాలంగా వివాదాలతో కూడా సతమతమవుతున్న రామోజీరావు మీడియారంగంలో తనదైన ముద్రవేసి 88 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు.