అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 17)
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాల తీరుతెన్నులపై సమీక్ష చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టిన మౌళిక వసతుల పనులు సకాలంలో జూన్ 10 లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు. అంగన్ వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు ఆదేశాలిచ్చారు. ప్రజావాణి, ధరణి దరఖాస్తుల పరిష్కారం, ధాన్యం కొనుగోళ్లపై సూచనలు చేశారు. లోక్ సభ ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించడంలో కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, ప్రభుత్వ సిబ్బంది పనితీరును అభినందించారు. భద్రాద్రి కొత్తగూడెం సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానికసంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య, ఆర్డీఓలు మధు, దామోదర్ రావు, డిడి (ట్రైబల్ వెల్ఫేర్) మణెమ్మ, డిసిఓ రుక్మిణి, వ్యవసాయశాఖ అధికారి బాబురావు, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిర, డిఎం (సివిల్ సప్లై) త్రినాథ్ బాబు, డిసిఓ ఖుర్షీద్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.