16న జడ్పీ స్థాయి సంఘాల సమావేశాలు
✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 14)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజాపరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు ఈనెల 16వ తేదీన కొత్తగూడెంలో జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు జడ్పీ సీఈఓ ప్రసూనరాణి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు వరుసగా ప్రణాళిక మరియు ఆర్దిక స్థాయి కమిటీ, గ్రామీణాభివృద్ధి స్థాయి కమిటీ, వ్యవసాయ స్థాయి కమిటీ, విద్యా వైద్య సేవల స్థాయి కమిటీ, మహిళా సంక్షేమ స్థాయి కమిటీ, సాంఘీక సంక్షేమ స్థాయి కమిటీ, పనుల స్థాయి కమిటీ సమావేశాలు జరుగనున్నట్లు ఆమె వెల్లడించారు. ఈ సమావేశాలకు జిల్లాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, జిల్లా పరిషత్ కో-ఆప్టెడ్ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులతో పాటు సంబందిత జిల్లాఅధికారులు సకాలంలో హాజరు కావాలని కోరారు.