Divitimedia
Bhadradri KothagudemDELHIHyderabadInternational NewsKhammamLife StyleMahabubabadNational NewsPoliticsSpot NewsTechnologyTelanganaWomenYouth

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

జిల్లాలో 67.93 శాతం పోలింగ్ నమోదు

✍️ దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం (మే 13)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఈ జిల్లాలో సోమవారం ఐదు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో జరిగిన పోలింగ్ ప్రక్రియలో సాయంత్రం 5 గంటలకు 67.93 శాతం పోలింగ్ నమోదైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.ప్రియాంకఅల విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో పినపాక సెగ్మెంట్ లో 65.91 శాతం, భద్రాచలంలో 64.72శాతం, ఇల్లందులో 69.11 శాతం, ఖమ్మం పార్లమెంటు పరిధిలోని కొత్తగూడెంలో 62.31శాతం, అశ్వారావుపేటలో 76.67శాతం ఓట్లు నమోదైందని, పోలింగ్ ప్రక్రియ ముగిసిందని ఆమె వెల్లడించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగియడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పూర్తి ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలింగ్ ప్రక్రియలో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరిన ఓటర్ల ఛైతన్యం, పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ ఐడీఓసీ నుంచి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ చేశారు. కొత్తగూడెం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని త్రీ ఇంక్లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఓటుహక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో నవభారత్ ఎదురుగా ఇందిరా ప్రియదర్శిని పాఠశాలలో ఏర్పాటు చేసిన 72వ పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల ఓటుహక్కు వినియోగించుకున్నారు.
చాతకొండ జెడ్పిహెచ్ఎస్ స్కూలులో ఏర్పాటుచేసిన మహిళా పోలింగ్ కేంద్రం, పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జగన్నాధపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. అక్కడ దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన వాహనాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపుకలెక్టర్ విద్యాచందన, పబువురు స్థానిక అధికారులున్నారు. జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల్లో పర్యటించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిస్థితులను సమీక్షిస్తూ, పోలింగ్ సరళిని పరిశీలించారు. కొత్తగూడెం సెయింట్ మేరీస్ స్కూల్, సింగరేణి హైస్కూల్, లక్ష్మీదేవిపల్లి మార్కెట్ యార్డ్, రామచంద్ర డిగ్రీకళాశాల, పాల్వంచలోని గట్టాయిగూడెం, ఇందిరానగర్ కాలనీ, బూర్గంపాడు మండలంలోని అంజనాపురం, మోరంపల్లిబంజర, రెడ్డిపాలెం తదితర పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. భద్రాచలం సబ్ డివిజన్ పరిధిలో చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలను భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ సందర్శించారు. భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తూ, పోలింగ్ సరళి గురించి అధికారులనడిగి తెలుసుకున్నారు..చర్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, దోసిల్లపల్లి పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచనలతో భద్రత బలగాలతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఏఎస్పీ ఈ సందర్బంగా తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నిర్భయంగా పాల్గొన్నారని, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగిందని వెల్లడించారు. కొత్తగూడెం నియోజకవర్గం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల, గొల్లగూడెంలలో ప్రజలు ఓటింగ్ నకు హాజరు కావడానికి నిరాకరిస్తున్నట్లు మీడియాలో వార్తలు రావడంతో ట్రైనీ ఏఎస్పీ విక్రాంత్ సింగ్, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి వారి సమస్యలను తీసుకెళ్లి ప్ఫజలు ఓటింగులో పాల్గొనే విధంగా కృషిచేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు వారిని ప్రత్యేకంగా అభినందించారు. లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్లలో ఆర్డీఓ మధు, ఇల్లందు మండలం లచ్చగూడెంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కాశయ్య పర్యటించి, అక్కడ ఓటర్ల సమస్య పరిష్కరించి, పోబింగ్ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16, నోటిఫికేషన్ విడుదలైన ఏప్రిల్ 18 నాటి నుంచి మే 13 పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు జిల్లా ప్రజల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనివని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా.ప్రియాంకఅల సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన మన జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని, ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన అధికారులు, అనధికారులు, జిల్లా ప్రజలకు, పాత్రికేయులకు జిల్లా కలెక్టర్ కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

ఐటీడీఏల రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు పకడ్బందీగా నిర్వహించాలి

Divitimedia

టీజీ సెట్-2024కు జనవరి 20లోపు దరఖాస్తు చేసుకోండి

Divitimedia

రేపట్నుంచి రాష్ట్ర ఫుట్ బాల్ జట్టు కోచింగ్ క్యాంప్

Divitimedia

Leave a Comment