‘ఏకలవ్య’లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి : ఐటీడీఏ పీఓ
✍️ దివిటీ మీడియా – భద్రాచలం (మే 8)
తెలంగాణ ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో నడపబడుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం
లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ బుధవారం ఓ ప్రకటనలో కోరారు. సీబీఎస్ఇ సిలబస్ ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులలో 2024 -25 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో 8 ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో గిరిజన విద్యార్థులకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ గ్రూపులలో ప్రవేశం పొందేందుకు, 2023- 24 విద్యాసంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన గిరిజన బాలబాలికలు ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 7, ఖమ్మం జిల్లాలో 1 ఏకలవ్య విద్యాలయాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో సీట్లు ఖాళీలున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులు ఈఎంఆర్ఎస్ విద్యాలయాలలో అందజేయాలని, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు పదవతరగతిలో మెరిట్ మార్కుల ఆధారంగా కౌన్సిలింగ్ లో అడ్మిషన్ ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. ఆ కౌన్సిలింగ్ ఈనెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుంచి ఈఎంఆర్ఎస్- చర్ల, భద్రాచలంలో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అలాగే దరఖాస్తు ఫారాలు సంబంధిత విద్యాలయాల్లో లభిస్తాయని, ప్రాంతీయ సమన్వయ అధికారి (ఖమ్మం రీజియన్) వెంకటేశ్వరరాజు, నోడల్ ప్రిన్సిపాల్ పూణెం వీరస్వామి తెలిపారు.
——————-
ఖాళీలు, ఇతర వివరాల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు
——————-
- ఈఎంఆర్ఎస్ గండుగులపల్లి (బాలికలు)లో సీట్లు ఎంపీసీ-9, సీఈసీ-27. ఫోన్ నెంబర్ (9948933010)
- ఈఎంఆర్ఎస్ పాల్వంచ (బాలికలు)లో సీట్లు ఎంపీసీ-6, బైపీసీ-1, సీఈసీ-26. ఫోన్ నెంబర్ (8317556834)
- ఈఎంఆర్ఎస్ గుండాల (బాలికలు)లో సీట్లు ఎంపీసీ-7, సీఈసీ-26. ఫోన్ నెంబర్(8978556948)
- ఈఎంఆర్ఎస్ టేకులపల్లి (బాలురు)లో సీట్లు బైపీసీ-15, సీఈసీ-15. ఫోన్ నెంబర్(7032266792)
- ఈఎంఆర్ఎస్ దుమ్ముగూడెం (బాలురు/బాలికలు)లో సీట్లు ఎంపీసీ-9, బైపీసీ-11, హెచ్ఈసీ-12. ఫోన్ నెంబర్ (9885871670)
- ఈఎంఆర్ఎస్ చర్ల (బాలురు/బాలికలు)లో సీట్లు ఎంపీసీ-7, బైపీసీ-15, సీఈసీ-25. ఫోన్ నెంబర్ (9701495907)
- ఈఎంఆర్ఎస్ ములకలపల్లి (బాలురు/బాలికలు)లో సీట్లు ఎంపీసీ-16, బైపీసీ-20, సీఈసీ-13. ఫోన్ నెంబర్ (7013497915).
- ఈఎంఆర్ఎస్ సింగరేణి (బాలురు/ బాలికలు)లో సీట్లు బైపీసీ-14, సీఈసీ-26. ఫోన్ నెంబర్ (9440801575).