సారపాక బస్టాండ్ వద్ద ప్రయాణికులకు చల్లని తాగునీరు
వాటర్ కూలర్ ఏర్పాటు చేసిన ఐటీసీ రోటరీక్లబ్
✍️ దివిటీ మీడియా – బూర్గంపాడు, ఏప్రిల్ 23
సారపాక బస్టాండ్ వద్ద ప్రయాణికులకు చల్లని తాగునీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు ఐటీసీ అనుబంధ సేవాసంస్థ రోటరీ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా, సారపాక సంస్థ ఒక ‘వాటర్ కూలర్’ ఏర్పాటు చేసింది. గ్రామపంచాయతీ అభ్యర్ధన మేరకు ప్రయాణికులకు చల్లని తాగునీటి కోసం అందజేసిన ఈ వాటర్ కూలర్ ను మంగళవారం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైక్ ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, అందరికీ చల్లని తాగునీరు సదుపాయం కల్పించినందుకు రోటరీక్లబ్ ను సారపాక గ్రామపంచాయతీ వారిని అభినందించారు. రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాసు, రోటరీక్లబ్ ప్రతినిథులు చెంగలరావు, ప్రపుల్ల సమంత సిగార్, నాగమల్లేశ్వరరావు, గ్రామపంచాయితీ కార్యదర్శి మహేష్, తదితరులు పాల్గొన్నారు.