“తగ్గేదెలే…” మేడమ్ టుస్సాడ్స్ సెల్ఫీతో అల్లు అర్జున్ హంగామా
✍️ దివిటీ మీడియా – సినిమా, మార్చి 29
దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని తన మైనపు విగ్రహంతో ప్రముఖ సినీ హీరో అల్లు అర్జున్ ఫొటోలకు పోజులిచ్చాడు. పుష్ప 2 స్టార్ గా ఏర్పాటుచేసిన మైనపు విగ్రహంతో గౌరవించబడిన ఆయన దుబాయ్‌లో తన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, అర్జున్ తన విగ్రహంతో ఉన్న ఫోటోను కూడా అభిమానులతో పంచుకున్నాడు. ఆయన విగ్రహం ఉన్న ఐకానిక్ పుష్ప భంగిమతో తన మైనపు విగ్రహంతో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో పంచుకున్నారు.“Here we go #MadameTussaudsdubai #ThaggedheLe.” అంటూ ఆయన మైనపు విగ్రహంతో సెల్ఫీని ‘X(ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్ లలో పంచుకోగా అభిమానులు రకరకాల కామెంట్స్ తో అభినందనలతో
ముంచెత్తుతున్నారు. “కంగ్రాట్స్ మిస్టర్ ఇండియన్ ఐకాన్”, “ఇంటర్నేషనల్ స్టార్ మేడమ్ టుస్సాడ్స్ కింగ్”, “Pushpaaa@alluarjunonline”, “సూపర్ అన్న తగ్గేదెలే”, “Fireuuuuuuuuu” అంటూ పలురకాలైన కామెంట్స్ తో అభిమానులు తమ ప్రేమను పంచుతూ ఆనందిస్తున్నారు.