Divitimedia
Bhadradri KothagudemCrime NewsEducationHyderabadLife StyleSpot NewsTelanganaYouth

ఇంటర్మీడియట్ పరీక్షకేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

ఇంటర్మీడియట్ పరీక్షకేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

✍ దివిటీ మీడియా – కొత్తగూడెం, ఫిబ్రవరి 28

ఇంటర్మీడియట్ ప్రారంభమైన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు బుధవారం రామవరంలోని ఎస్.ఆర్ జూనియర్ కళాశాలలో పరీక్షకేంద్రాన్ని పరిశీలించారు. ఆయన ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రతాచర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా పరీక్షల కేంద్రాల వద్ద 144సెక్షన్ అమల్లో ఉన్నందున పరిసర ప్రాంతాల్లో ఎక్కువమంది గుమిగూడనివ్వద్దని సూచించారు. పరీక్షలు జరిగే సమయంలో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అధికారులు ఎవరైనా సరే పూర్తిగా తనిఖీ చేశాకే కేంద్రం లోపలికి అనుమతించాలని అక్కడ విధులలో ఉన్న సిబ్బందికి సూచించారు.

Related posts

రాష్ట్రపతిభవన్ లో భద్రాద్రి గిరిజన మహిళల స్టాల్స్

Divitimedia

సమయపాలన పాటించనివారిపై కఠినచర్యలకు శ్రీకారం

Divitimedia

అంగన్వాడీలకు వేతనం పెంచాలని కలెక్టరేట్ ముట్టడి

Divitimedia

Leave a Comment