ప్రభుత్వ పాఠశాల వార్షిక పర్యవేక్షణ
✍ దివిటీ మీడియా – కొత్తగూడెం, ఫిబ్రవరి 27
రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సూచనల మేరకు కొత్తగూడెం మున్సిపాలిటీలో రామవరం ప్రభుత్వ హైస్కూల్ పరిధిలోని 2ఇంక్లైన్ ప్రభుత్వ పాఠశాలను నోడల్ అధికారి డాక్టర్ ప్రభుదయాల్ మంగళవారం సందర్శించారు. అకడమిక్ రికార్డులు పరిశీలించారు. విద్యాప్రమాణాల మెరుగుదలకు పలు సూచనలు చేశారు. ప్రాథమిక విద్య స్థాయిలోనే విద్యాసామర్ధ్యాలు పెంచగలిగితే తదుపరి స్థాయిలలో విద్యార్థులు సులభంగా, ఉత్సాహంగా రాణిస్తారని సూచించారు. ఏప్రిల్ నెలాఖరులోగా రామవరం స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు.