Divitimedia
HyderabadLife StylePoliticsSpot NewsTechnologyTelangana

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం

ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా శ్రీనివాసరెడ్డి నియామకం

✍ దివిటీ మీడియా – హైదరాబాదు, ఫిబ్రవరి 25

తెలంగాణా రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా కె శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకానికి సంబంధించి సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ సెక్రెటరీ ఎం హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టు యూనియన్ జాతీయ నాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ప్రజాపక్షం పత్రిక ఎడిటర్(సంపాదకుడు)గా ఉన్నారు. ఆయన ప్రెస్ అకాడమీ ఛైర్మన్ హోదాలో రెండేళ్లపాటు కేబినెట్ ర్యాంకులో పదవిలో కొనసాగుతారు. సీనియర్ జర్నలిస్టు శ్రీనివాసరెడ్డిని ప్రభుత్వం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ గా నియమించడం పట్ల పలువురు జర్నలిస్టు నాయకులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

అడవిజంతువుల వేటపై అప్రమత్తమైన పోలీసు శాఖ

Divitimedia

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

Divitimedia

వేడుకగా ఐటీసీ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్‌భద్రా ఇన్‌స్టాలేషన్

Divitimedia

Leave a Comment