16వ యూసుఫ్ కప్ ట్రోఫీల ఆవిష్కరణ
✍🏽 దివిటీ – బూర్గంపాడు (జనవరి 16)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో నిర్వహిస్తున్న 16వ యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీలను జడ్పీటీసీ మాజీ సభ్యుడు బట్టా విజయగాంధీ, ట్రోఫీ స్పాన్సర్ డేగల రాజుయాదవ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మిత్రుని జ్ఞాపకార్థం 16సంవత్సరాల నుంచి ఘనంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. ఒక సామాన్య వ్యక్తి పేరు మీద ఇన్నేళ్లుగా ప్రైవేటు టోర్నమెంట్ నిర్వహించడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే మొదటిదని చెప్పుకోవచ్చన్నారు. భవిష్యత్తులో కూడా ఈ టోర్నమెంట్ ఇంతే ఘనంగా నిర్వహించాలని, ప్రతి సంవత్సరం ట్రోపీలు తామే ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దారం కృష్ణారెడ్డి, యారం రమణారెడ్డి, ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు ఎండీ సోహెల్ పాషా, గోనెల సర్వేశ్వరరావు, కన్నెబోయిన సారధి, సత్తిపండు, తదితరులు పాల్గొన్నారు.