యూసుఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
✍🏽 దివిటీ – బూర్గంపాడు (జనవరి 12)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలకేంద్రంలో మరణించిన తమ మిత్రుడి జ్ఞాపకార్థం 16సంవత్సరాల నుంచి బూర్గంపాడు యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యూసఫ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బూర్గంపాడు ఎస్సై రాజ్ కుమార్ బ్యాటింగ్ చేసి టోర్నమెంట్ ప్రారంభించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ, రోడ్డుప్రమాదంలో మరణించిన మిత్రుని జ్ఞాపకార్థం టోర్నమెంట్ నిర్వహించడం గొప్ప విషయమని బూర్గంపాడు యువతని అభినందించారు. ఈ కార్యక్రమంలో బూర్గంపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ సిరిపురపు స్వప్న, మొదటి నగదు బహుమతి ప్రదాత, సొసైటీ డైరెక్టర్ బొల్లు రవికుమార్, జడ్పీటీసీ మాజీ సభ్యుడు బట్టా విజయగాంధీ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు జక్కం సర్వేశ్వరరావు, ఆశిక్, సాదిక్, ఆర్గనైజింగ్ కమిటీ ప్రతినిధులు సోహెల్ పాషా, గొనెల సర్వేశ్వరావు, భజన సతీష్, గోనెల నాని, భజన ప్రసాద్, అబ్దుల్ సలీం, కన్నబోయిన సారథి, శనగ కిషోర్, అబ్దుల్ నయీమ్, తదితరులు పాల్గొన్నారు.