Divitimedia
Bhadradri KothagudemCrime NewsHyderabadLife StyleNational NewsSpecial ArticlesTechnologyTelanganaTravel And TourismWomen

సంక్రాంతికి ఊరెళ్తున్నారా… అయితే జరభద్రం…!

సంక్రాంతికి ఊరెళ్తున్నారా… అయితే జరభద్రం…!

జిల్లా పోలీసుశాఖ తరపున ఎస్పీ రోహిత్ రాజ్ సూచనలు

సూచనలు పాటించి దొంగతనాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని విఙ్ఞప్తి

అనుమానిత వ్యక్తుల కదలికలను గమనించి, పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న ఎస్పీ

✍🏽 దివిటీ – భద్రాద్రి కొత్తగూడెం (జనవరి 12)

సంక్రాంతి పండగ దృష్ట్యా చాలామంది దూర ప్రయాణాలు చేస్తుంటారనేది అదనుగా భావించి దొంగలు చేతివాటం ప్రదర్శిస్తారని, అందుకే ఊళ్లకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రజలకు సూచించారు. చోరీల నియంత్రణకు తాము అన్ని చర్యలు చేపట్టామని, ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని, రాత్రి వేళల్లో గస్తీని ముమ్మరం చేశామని, ఈ విషయంలో జిల్లా ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుని పోలీసులకు సహకరించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.

సంక్రాంతికి ఊరెళ్లే వారికి జిల్లా పోలీసు వారి సూచనలు

* దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ ఇంటి చిరునామా,ఫోన్‌ నెంబర్‌ను సంబంధిత పోలీసు స్టేషన్‌ అధికారులకు తెలపాలి.దీంతో వారి వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసుకుని ఊర్లెళ్లిన వారి ఇళ్లపై నిఘాను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

* ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం క్షేమం లేదా ఎక్కువ రోజులు ఊళ్లకు వెళ్లేవారు విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.

  • ఊరు వెళ్తున్నప్పుడు పక్కింటివారికి తమ ఇంటి పరిసరాలను గమనించాలని చెప్పాలి.
  • మెయిన్ డోర్ కు తాళం వేసి వెళ్లేటప్పుడు ఆ తాళం కనిపించకుండా డోర్ కర్టెన్స్ ఏర్పాటు చేసుకోవాలి.
  • వీలైతే హోం అలారం సిస్టం ఏర్పాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
  • విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో, కార్లలో పెట్టడం వంటివి చేయకూడదు.
  • ద్విచక్రవాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి, రోడ్లపై నిలుపకూడదు.
  • బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా తమతోపాటే తీసుకెళ్లాలి.
  • గ్రామాలకు వెళ్లేవారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.
  • విలువైన వస్తువుల సమాచారాన్ని, వ్యక్తిగత ఆర్థిక విషయాలను ఇతరులకు చెప్పకూడదు.
  • ఆరుబయట వాహనాలకు హాండిల్ లాక్ తో పాటు వీల్ లాక్ చేసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • వాచ్ మెన్ లేదా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం మంచిది.
  • ఇళ్లకు తాళాలు వేసి ఊళ్లకు వెళ్లేటప్పుడు చుట్టు పక్కల వారికి లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఖచ్చితంగా సమాచారం అందించండి.
  • అనుమానాస్పదంగా తమ వీధుల్లో తిరిగే కొత్త వ్యక్తుల కదలికలపై డయల్ 100 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలి.

Related posts

నవంబరు 10న ఉమ్మడి జిల్లా పాఠశాలల బాక్సింగ్, సాఫ్ట్ బాల్ ఎంపికలు

Divitimedia

మినీస్టేడియం త్వరగా అందుబాటులోకి తేవాలి: కలెక్టర్

Divitimedia

ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment