ప్రగతి విజేతలను అభినందించిన బ్రహ్మారెడ్డి
✍🏽 దివిటీ – బూర్గంపాడు
కొత్తగూడెంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో 8, 10, 12 ఏళ్లలోపు బంగారు పతకాలు, రజత పతకాలు సాధించి, వచ్చే నెలలో జరగనున్న రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన చిన్నారులను సారపాకలోని ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి గురువారం (డిసెంబర్ 21) అభినందించారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.