Divitimedia
Bhadradri KothagudemEducationHyderabadKhammamLife StyleTelanganaYouth

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

విద్యార్థులు ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలి

ప్రధానోపాధ్యాయులతో ఐటీడీఏ పీఓ జూమ్ మీటింగ్

చర్చనీయాంశంగా ‘దివిటీ మీడియా’ స్పెషల్ స్టోరీ

✍🏽 కె.ఎన్.ఆర్ – దివిటీ మీడియా

ఆశ్రమ పాఠశాలల్లో 10వ తరగతిలో ఉన్న విద్యార్థులందరూ ‘ఎ’, ‘బి’ గ్రేడ్స్ సాధించేలా కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ‘సి’, ‘డి’ గ్రేడ్స్ లోని విద్యార్థుల సామర్ధ్యాలు మెరుగుపడేరీతిలో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో దిగజారుతున్న పరిస్థితుల గురించి ‘దివిటీ మీడియా’లో బుధవారం ప్రచురితమైన స్పెషల్ స్టోరీ చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు బుధవారం(నవంబరు 15) పీఓ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగులో మాట్లాడుతూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా కృషిచేయాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ ఖమ్మం, భద్రాచలం డిప్యూటీ డైరెక్టర్ పి.మణెమ్మ, ఏటీడబ్ల్యుఓలు, ఏసీఎం, పీఎంఆర్సీ కూడా పాల్గొన్నారు.

Related posts

నేడు భద్రాచలం ఐటీడీఏలో గిరిజన దర్బార్

Divitimedia

‘కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్న పాలకులు’

Divitimedia

యూపెస్సీ ర్యాంకర్ల ఆధ్వర్యంలో ‘స్పూర్తి’ కార్యక్రమం

Divitimedia

Leave a Comment