గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు సంజయ్ సింగ్ వితరణ
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
సారపాకలోని ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్భద్రా ఆధ్వర్యంలో స్థానిక గాంధీనగర్ శ్రీసత్యసాయి స్కూలుకు ఐటీసీ పీఎస్ పీడీ సీఎంసీ మెంబర్ సంజయ్ సింగ్ 2 ట్యాబులు, ఒక ప్రింటర్ సహాయం అందించారు. ఐటీసీ పీఎస్ పీడీ అనుబంధ రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా సారపాకకు ఛార్టర్డ్ ప్రెసిడెంట్ అయిన సంజయ్ సింగ్ బాలలకు వికాసం కోసం ఈ సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఐటీసీ పీఎస్ పీడీ అధికారి చెంగలరావు చేతుల మీదుగా వాటిని ఆదివారం స్కూలు యాజమాన్యానికి అందజేశారు. ఆ స్కూల్ యాజమాన్యం ఈ సందర్భంగా సంజయ్ సింగ్ అందజేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీక్లబ్ ఆఫ్ ఇన్ భద్రా ప్రెసిడెంట్ జయంత్ కుమార్ దాస్ మాట్లాడుతూ, అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయనతోపాటు సెక్రెటరీ కె.వి.ఎస్ గోవిందరావు, సభ్యుడు రంజిత్, రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ ఇన్ భద్రా సభ్యులు స్నేహ, భార్గవి, తదితరులు పాల్గొన్నారు.