పొంగులేటి సమక్షంలో కాంగ్రెసులో చేరిన బెల్లంకొండ రామారావు
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాపరిధిలోని పినపాక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బహిరంగసభకు కొన్ని గంటల ముందు ఆ పార్టీ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన అందరికీ సుపరిచితుడైన ప్రస్తుత బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బెల్లంకొండ రామారావు, దాదాపు 50 మంది అనుచరులతో కలిసి ఖమ్మం మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెసు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మండలంలో తమ సామాజికవర్గం తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, జిల్లాలో కాంగ్రెస్ గెలుపు కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బూర్గంపాడు మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహ్మద్ ఖాన్, జిల్లా కార్యదర్శి చల్లా వెంకటనారాయణ, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు పోతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నాయకులు ఇంగువ రమేష్, లక్ష్మీపురం గ్రామ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కోట నాగిరెడ్డి, పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.