Divitimedia
Bhadradri KothagudemHyderabadKhammamLife StylePoliticsTelangana

పాలేరులో నామినేషన్ దాఖలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పాలేరులో నామినేషన్ దాఖలు చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఇల్లందులో కోరం, అశ్వారావుపేటలో మెచ్చా, పినపాకలో పాయం నామినేషన్లు

ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శనివారం 15మంది నామినేషన్లు

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పినపాక నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో జడ్పీ మాజీ ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, భూక్యా మంగీలాల్ కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేశారు. కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీ తరపున ఎర్ర కామేశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున అవుతుపల్లి రామ లింగేశ్వరావు నామినేషన్ దాఖలు చేశారు. పాలేరు నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా షేక్ సిరాజుద్ధీన్, భైరవబొట్ల శ్రీనివాసరావు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా మరకపూడి శ్రీనివాసులు, మధిర నియోజకవర్గంలో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా బలవంతపు కల్యాణ్ కుమార్, స్వతంత్ర అభ్యర్థిగా బొమ్మెర రామ్మూర్తి నామినేషన్లు దాఖలు చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థినిగా అంబోజు స్వర్ణలత నామినేషన్ దాఖలు చేశారు. వైరా నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా వర్సా రాములు నామినేషన్ దాఖలు చేశారు. భద్రాచలంలో స్వతంత్ర అభ్యర్థిగా పండ్రా హేమసుందర్ నామినేషన్ దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో శనివారం మొత్తం 15మంది నామినేషన్లు దాఖలు చేశారు.


———————-
నవంబరు 5న నామినేషన్ల ప్రక్రియకు సెలవు : కలెక్టర్ డా.ప్రియాంకఅల
———————-
ప్రభుత్వ సెలవు అయినందున నవంబరు 5వ తేదీన (ఆదివారం) నామినేషన్లు స్వీకరించబడవని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. 6వ తేదీ సోమవారం నుంచి 10వ తేదీ వరకు రోజూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు యధావిధిగా నామినేషన్లు స్వీకరిస్తారని ఆమె వెల్లడించారు.

Related posts

విలువిద్య పోటీల్లో జాతీయస్థాయికి ఎంపికైన మమత

Divitimedia

ఊరించి… ఉడికించి… సిట్టింగులకు వరమిచ్చిన అధినేత

Divitimedia

ఎస్సైగా ఎంపికైన తేజేశ్వర్ రెడ్డికి ‘నేస్తం ట్రస్ట్’ సన్మానం

Divitimedia

Leave a Comment