అలెర్ట్… అలెర్ట్… కొత్తగూడెంలో ఆదివారం ట్రాఫిక్ మళ్లింపు
సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసుల నిర్ణయం
✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణం ప్రకాశం స్టేడియంలో నవంబరు 5వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు కఠినంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ‘ప్రజా ఆశీర్వాద సభ’ సందర్బంగా భద్రతా కారణాల దృష్ట్యా 4 గంటలపాటు ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్ళింపులు విధించనున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు భద్రతా కారణాల దృష్ట్యా కొత్తగూడెం పట్టణంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. భద్రాచలం నుంచి ఖమ్మం వైపు వెళ్లే వాహనాలకు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అనుమతి లేదని వెల్లడించారు. భద్రాచలం నుంచి పాల్వంచ మీదుగా ఖమ్మం వెళ్లేవారు టేకులపల్లి, ఇల్లందు మార్గంలోనే ఖమ్మం వెళ్ళాలని తెలిపారు. అదే సమయంలోనే భద్రాచలం నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు పాల్వంచ నుంచి దమ్మపేట రోడ్డులో, మాదారం, అన్నపురెడ్డిపల్లి మీద నుంచి ఎర్రగుంట వద్ద విజయవాడ రోడ్డుకు చేరుకుని వెళ్లవలసిందిగా డీఎస్పీ రెహమాన్ కోరారు. కాబట్టి భద్రాచలం, మణుగూరు వైపు నుంచి ఖమ్మం, విజయవాడ వైపు ప్రయాణం చేయాలనుకునేవారు ఈ మార్పు గమనించి ఇబ్బందులు లేకుండా ‘ప్లాన్’ చేసుకోవాల్సి ఉంటుంది…