Divitimedia
Bhadradri KothagudemEducationLife StyleSportsTelanganaYouth

నవంబర్ 4న ఉమ్మడి జిల్లా పాఠశాలల ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు

నవంబర్ 4న ఉమ్మడి జిల్లా పాఠశాలల ఆర్చరీ క్రీడాకారుల ఎంపికలు

✍🏽 దివిటీ మీడియా – క్రీడా విభాగం

ఉమ్మడి ఖమ్మం జిల్లా అండర్-14, 17 బాల బాలికల విలువిద్య (ఆర్చరీ) క్రీడాకారుల
ఎంపికలు నవంబర్ 4వ తేదీన కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్ లో నిర్వహించనున్నామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరాచారి, ఉమ్మడిజిల్లా పాఠశాలల క్రీడాకార్యదర్శులు కె.నర్సింహామూర్తి, స్టెల్లా ప్రేమ్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికల్లో పాల్గొనాలనే ఆసక్తి కలిగిన అండర్-14, 17 క్రీడాకారులు 4వ తేదీన ఉదయం 9 గంటలకు తమ సొంత కిట్టుతో ఎంపికలకు కిన్నెరసానిలో హాజరుకావాలని కోరారు. అండర్-17 క్రీడాకారులు ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ లోపు చదువుతూ 2007 జనవరి 1 తర్వాత జన్మించినవారై ఉండాలన్నారు. 9,10వ తరగతులలో చదువుతున్న వారు పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా స్టడీ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని సూచించారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న వారైతే 10వ తరగతి ఇంటర్నెట్ మెమో డౌన్ లోడ్ చేసుకుని, ఆ కళాశాల ప్రిన్సిపాల్ సంతకం చేయించుకుని, కళాశాల బోనఫైడ్ పత్రం, ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని రావాలని కోరారు. అండర్-14 క్రీడాకారులు ఈ విద్యా సంవత్సరంలో 6వ తరగతి నుంచి 9వ తరగతి లోపు చదువుతూ 2010 జనవరి 1 తర్వాత జన్మించినవారు మాత్రమే అర్హులని తెలిపారు. పైన పేర్కొన్న ధ్రువీకరణపత్రాలు తీసుకొని రానివారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంపికలకు అనుమతించబోమని వారు ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న పీఈటీలు, పీడీలంతా ఈ నియమనిబంధనలు పాటిస్తూ తమ క్రీడాకారులు హాజరయ్యేలా చూడాలని, ఇతర వివరాలకు 9398284976 నెంబర్ లో మారెప్పను సంప్రదించాలని కోరారు.

Related posts

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్

Divitimedia

సంక్షేమ పథకాలకు ప్రత్యేకాధికారుల నియామకం

Divitimedia

జిల్లా గ్రంధాలయం పరిశీలించిన కలెక్టర్ జి.వి.పాటిల్

Divitimedia

Leave a Comment