Divitimedia
Bhadradri KothagudemLife StylePoliticsTelangana

ఎన్నికల ప్రక్రియకు వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలి : కలెక్టర్

ఎన్నికల ప్రక్రియకు వాహనాలు సిద్ధంగా ఉంచుకోవాలి : కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

జిల్లాలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియకు అవసరమైన వాహనాల కోసం నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల తెలిపారు. శనివారం ఐడీఓసీ మినీ సమావేశమందిరంలో రవాణా కార్యాచరణ నివేదిక, నామినేషన్ ప్రక్రియకు ఏర్పాట్లు, 31వ తేదీ వరకు నూతన ఓటర్ల నమోదు, తదితర అంశాలపై రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఐదు నియోజకర్గాల పరిధిలోని 1095 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సామగ్రి సరఫరాకు 138 సెక్టార్లు, 149 రూట్లుగాను విభజించినట్లు చెప్పారు. పోలింగ్ ప్రక్రియ కోసం 4380 మంది సిబ్బంది, 190 మంది పోలీసులు మొత్తం 6570 మంది జాబితా సిద్ధం చేసినట్లు చెప్పారు. నియోజకవర్గాల వారీగా అవసరమైన వాహనాలకోసం మిని, పెద్ద వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల వివరాలు అందజేయాలని ఆమె రిటర్నింగ్ అధికారులకు సూచించారు. మొత్తం 217 వాహనాలు అవసరమవుతున్నట్లు ప్రాథమికంగా నివేదికలు సిద్ధం చేశామని, రిటర్నింగ్ అధికారులు పరిశీలించి అవసరం మేరకు నివేదికలు అందచేయాలన్నారు. మారుమూల ప్రాంతాలు, పట్టణాలు, అన్ని ప్రాంతాలకు సామగ్రితో వెళ్లాల్సి ఉన్నందున అన్ని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి వాహనాల అవసరంపై నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అందుబాటులో ఉన్న వాహనాల జాబితాను అందజేయాలని రవాణాశాఖ అధికారులకు సూచించారు. వాహనాలు కండిషన్లో ఉండాలని చెప్పారు. కొన్ని రూట్లలోకి పెద్ద వాహనాలు వెళ్లడానికి అవకాశం ఉండదని, అలాంటి రూట్లకు మిని వాహనాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 31వ తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారు నూతన ఓటరుగా నమోదు కావడానికి అవకాశం ఉన్నందున వచ్చిన దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున రిటర్నింగ్ అధికారులు వారి వారి కార్యాలయాల్లో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయాలని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియకు కావాల్సిన ధృవీకరణలపై పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు. నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని చెప్పారు. నామినేషన్ ప్రక్రియ వీడియో, ఫోటోగ్రఫీ చేయించాలని చెప్పారు. నియోజవర్గం పరిధిలో ప్రసారం అవుతున్న సిటీ కేబుళ్లలో ప్రసారమయ్యే రాజకీయ ప్రకటలను పర్యవేక్షించాలన్నారు. ముందస్తుగా సిటీ కేబుళ్ల నిర్వాహకులతో సమావేశం నిర్వహించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, ప్రి సర్టిఫికేషన్, తదితర వివరాలను తెలియజేయాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచలం రిటర్నింగ్ అధికారులు రాంబాబు, శిరీష, మంగీలాల్, డీఆర్ఓ రవీంద్రనాథ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు దారా ప్రసాద్, నియోజకవర్గకేంద్రంలోని సహాయ రిటర్నింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యతోనే దివ్యాంగులు అభివృద్ధి సాధించాలి : కలెక్టర్

Divitimedia

ఆదమరిస్తే… అంతే సంగతులు…

Divitimedia

వినికిడిలోపం ఉన్నవారికి ‘గోల్కొండ’, ‘రామప్ప’లో సౌకర్యాలు

Divitimedia

Leave a Comment