ఎన్నికలు ముగిసేవరకు ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు : కలెక్టర్
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రజాసమస్యలపై దరఖాస్తులు, ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించేందుకు వారం వారం సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’ కార్యక్రమం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు రద్దు చేసినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డా ప్రియాంకఅల ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల(అక్టోబరు) 30వ తేదీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని కూడా రద్దుచేసినట్లు ఆమె తెలిపారు. జిల్లా అధికారయంత్రాంగం ఎన్నికల విధుల్లో నిమగ్నమైనందున ప్రజావాణి కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తునట్లు తెలిపారు. ఎన్నికలప్రవర్తనా నియమావళి ముగిసేంత వరకు ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు ఈ విషయం గుర్తించి ఫిర్యాదులు అందజేసేందుకు కలెక్టరేట్ కు రావద్దని ఆమె పేర్కొన్నారు.