గుండాల, కరకగూడెం, ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాఎస్పీ డాక్టర్ వినీత్, ఓఎస్డీ టి.సాయిమనోహర్ కలిసి బుధవారం సాయంత్రం గుండాల, కరకగూడెం, ఏడూళ్లబయ్యారం పోలీసుస్టేషన్లను ఆకస్మికంగా సందర్శించి, పరిశీలించారు. ఆ పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రజల ప్రస్తుత స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏజెన్సీ ప్రాంతంలోని పోలీసు అధికారులు మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా వారికి మనోధైర్యాన్ని కల్పించాలని సూచించారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేకనిఘా ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు. అనంతరం సార్వత్రిక ఎన్నికలకు ఏడూళ్లబయ్యారంలో ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను పరిశీలించారు.