పేద విద్యార్థినికి నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లిబంజర్ గ్రామానికి చెందిన పేద విద్యార్థిని జ్వలితకు గ్రామానికి చెందిన నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఉన్నత చదువులకు సాయం కోసం ఆదివారం రూ.10వేలు అందజేశారు. చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ ఉన్న ఆమె 10వ తరగతిలో 9.5 జీపీఏ, ఇంటర్ ఒకేషనల్ కోర్సులో రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంక్ సాధించి, ప్రస్తుతం కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ కాలేజీలో బి.కామ్(సీఏ) చదువుతోంది. ఆమె తండ్రి శనగ ముత్తయ్య ఆటో నడుపుతూ, తల్లి రోజా కూలిపనులు చేస్తూ చిన్న కూతురు జ్వలితతోపాటు పెద్ద కూతురు హన్సికను బీటెక్ చదివిస్తున్నారు. ఇద్దరికీ హాస్టల్ ఫీజు, బుక్స్ కోసం ఇబ్బంది పడుతున్నారనే సమాచారం మేరకు నేస్తం వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జ్వలితకు ఆర్ధికసాయం అందించారు. ఈ సందర్బంగా ట్రస్ట్ చైర్మన్ బత్తుల రామకొండారెడ్డి మాట్లాడుతూ జ్వలిత అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వైస్ చైర్మన్ చింతా అంకిరెడ్డి, సెక్రటరీ ఇండ్ల వెంకటరాజేష్ , సభ్యులు కైపు మహేశ్వరరెడ్డి, కామిరెడ్డి వెంకటరామిరెడ్డి, సంకా సురేష్, సొసైటీ డైరెక్టర్ బత్తుల రామకొండారెడ్డి,
బాలనారాయణరెడ్డి పాల్గొన్నారు.