Divitimedia
Bhadradri KothagudemHyderabadMahabubabadPoliticsTelangana

నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

నిబంధనల ప్రకారం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం కావాలి

వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్

✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం

భారత ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సన్నద్దం కావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన రాష్ట్ర సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి సర్ఫరాజ్ అహ్మద్, ఇతర రాష్ట్రస్థాయి అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా
వికాస్ రాజ్ మాట్లాడుతూ, భారత ఎన్నికల కమిషన్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినందున రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని ప్రకటించారు. 24 గంటల లోగా వ్యవధిలో అన్ని ప్రభుత్వభవనాలలో వివిధ రాజకీయపార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, నాయకుల ఫోటోలు, వాల్ రైటింగ్స్ తొలగించాలని, 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద హోర్డింగులు, ఫ్లెక్సీలు ఫోటోలు తొలగించాలని, ప్రైవేట్ స్థలాలో ఉన్న హోర్డింగులు, ఫ్లెక్సీలు, ఫోటోలను 72 గంటల్లో తొలగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల వెబ్ సైట్లు, జిల్లా వెబ్ సైట్లలో మంత్రులఫోటోలు, ముఖ్యమంత్రి ఫోటో తొలగించాలన్నారు. రాజకీయ పార్టీలు, వివిధ వర్గాల చెందిన ప్రజలకు ర్యాలీలు, సభల నిర్వహణకు అనుమతులు నిబంధనల ప్రకారం ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో జారీ చేయాలని ఆయన సూచించారు. నవంబర్ 3న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, అప్పటి వరకు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు, మీడియా సెంటర్ ఏర్పాటు, ఎన్నికల విధుల నిర్వహణకోసం సిబ్బందికి శిక్షణ, తదితర కార్యక్రమాలు పూర్తి చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల మ్యాపింగ్ వివరాలు సమర్పించాలన్నారు.
రాజకీయపార్టీల, అభ్యర్థులకు సంబంధించి ప్రకటనలకు అనుమతి అదే రోజు అందించే విధంగా ఎంసీఎంసీ పని చేయాలన్నారు. శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు సంబంధించి రిపోర్టులు ప్రతిరోజూ తప్పక సమర్పించే విధంగా జిల్లాలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. 2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్ద నుంచి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని, దీనికి తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో దివ్యాంగుల ఓటర్లను పోలింగ్ కేంద్రాల వారీగా మ్యాపింగ్ చేసుకోవాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఇతర ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఫిర్యాదులు సేకరించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో త్రాగునీరు, లైటింగ్ ,ర్యాంపు, నీటిసరఫరా ఉన్న టాయిలెట్ల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మోడల్ పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించే సమయంలో రిటర్నింగ్ అధికారులకు తగిన భద్రత ఏర్పాటు చేయాలని, నామినేషన్లు స్వీకరించే సమయంలో తప్పక నిబంధనలు పాటిస్తూ నామినేషన్ పత్రాల్లో అంశాలన్నీ నింపారో, లేదో చెక్ చేసుకోవాలని, నింపని పక్షంలో సదరు అభ్యర్థులకు రాతపూర్వక సమాచారం అందించాలన్నారు. ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రతినిధులు ప్రభుత్వయంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని, అక్టోబర్ 30 వరకు వచ్చే కొత్త ఓటరు దరఖాస్తులు పరిశీలించాలని సూచించారు. ఓటింగ్ స్లిప్పుల పంపిణీ నామినేషన్ల ముగింపు తేది తర్వాత నుంచి చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఐడీఓసీ నుంఛి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, ఎస్పీ డాక్టర్ వినీత్, అదనపు కలెక్టర్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా నుంచి కలెక్టర్ కె.శశాంక, ఎస్పీ జి.చంద్రమోహన్, అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అశ్వనీవైష్ణవ్‌

Divitimedia

నామినేషన్ల ప్రక్రియ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్

Divitimedia

‘ముక్తార్ పాషా, పైలా చంద్రక్కల అమరత్వం మహోన్నతం’

Divitimedia

Leave a Comment