ఏజెన్సీ చట్టాలపై అవగాహన కార్యక్రమానికి హాజరు కావాలి
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
ఏజెన్సీప్రాంతంలో అమలులో ఉన్న చట్టాల గురించి అక్టోబరు 7వ తేదీన భద్రాచలంలో ఐటీడీఏ ఆవరణలోని ‘గిరిజన భవన్’ లో నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధిత అధికారులు, ఉద్యోగులు తప్పక హాజరు కావాలని ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్ఓఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా, తదితర చట్టాలపై అందరికీ అవగాహనకు నిర్వహిస్తున్న సమావేశంలో జిల్లా డీఆర్డీఓ, డీపీఓ, సహకార అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, పిసా వైస్ ప్రెసిడెంట్స్ , సెక్రటరీలు, మొబలైజర్స్ పాల్గొనాలని పీఓ కోరారు. 7వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమంలో చట్టాల పట్ల విశేషమైన అనుభవమున్న సీనియర్ న్యాయవాది త్రినాధరావు ఆర్వోఎఫ్ఆర్, ఎల్టీఆర్, పిసా చట్టాలపై అమూల్యమైన న్యాయసలహాలు, సూచనలు అందిస్తారని ఆయన తెలిపారు. జిల్లా పరిధిలోని అన్ని మండలాల అధికారులు, ఉద్యోగులు వారి మండలాల నుంచి ప్రతినిధులందరూ ఈ అవగాహన సదస్సులో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని పీఓ పేర్కొన్నారు.