పరిశ్రమల ప్రతినిధులతో ఓటుహక్కుపై కలెక్టర్ సమావేశం
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ఓటుహక్కు ప్రాథమిక హక్కుగా అందరూ సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ డా ప్రియాంకఅల తెలిపారు. శనివారం ఐడీఓసి సమావేశ మందిరంలో అన్ని పరిశ్రమల అధికారులు, యూనియన్ నాయకులతో ఓటు హక్కు నమోదు, వినియోగం తదితర అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల్లో పనిచేస్తున్న సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఓటుహక్కు నమోదుచేసుకోవాలని తెలిపారు. అక్టోబరు 1వ తేదీనాటికి జిల్లాలో 18సంవత్సరాలు నిండే యువకులందరూ తప్పనిసరిగా తమ ఓటుహక్కు నమోదు చేసుకోవాలన్నారు. పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలియజేసేందుకు విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వ హించాలని అధికారులకు సూచించారు. ఓటు నమోదు కోసం ఓటర్ హెల్ప్ లైన్, ఎన్.వి.ఎస్.పి యాప్ ద్వారా తమ తమ ఓటు నమోదుచేసుకోవచ్చని కూడా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ సీతారాం, సింగరేణి జీఎం బసవయ్య, కేటీపీఎస్ సిఇ లు వెంకటేశ్వరరావు, ప్రభాకరరావు, నవ భారత్ డీజీఎం శంకరయ్య, ఐటీసీ పీఎస్ పీడీ హరిప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.