Divitimedia
Bhadradri KothagudemEducationTelanganaYouth

రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం

రామవరం హైస్కూల్లో ‘ఉత్తమ భవిష్యత్తు’ అవగాహన కార్యక్రమం

✍🏽 దివిటీ మీడియా – రామవరం

కొత్తగూడెం మున్సిపాలిటీ రామవరంలోని ప్రభుత్వ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు ‘ఉత్తమ భవిష్యత్తు కోసం ఏం చేయాలి?’ అనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహించే ప్రత్యేక సహ పాఠ్యకార్యక్రమాల పరంపరలో భాగంగా విద్యార్థులకు భవిష్యత్తు జీవితం గురించి సవివరంగా వివరించి అవగాహన కల్పించారు. 10వ తరగతి విద్యార్థులకోసం ప్రభుత్వం నిర్దేశించిన “లక్ష్య “కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నామని, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రభుదయాళ్ ఈ సందర్భంగా వెల్లడించారు. సమగ్ర రీతులలో విద్యాభివృద్ధి కోసం కృషి జరుగుతోందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సంతోష్ ట్రోఫీ పోటీలకు ఆతిథ్యమివ్వడం సంతోషకరం

Divitimedia

విద్యార్థులలో సామర్ధ్యాలు పెంచాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే

Divitimedia

వన్ టౌన్ పీఎస్ ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

Divitimedia

Leave a Comment