Divitimedia
Bhadradri KothagudemCrime NewsPoliticsTelangana

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో భీభత్సం సృష్టించిన భారీవర్షం

భద్రాద్రి పుణ్యక్షేత్రంలో భీభత్సం సృష్టించిన భారీవర్షం

కేటీఆర్ భద్రాద్రి పర్యటన రద్దు, మహిళా కానిస్టేబుల్ దుర్మరణం

✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం

అసలే నిరసనలు… నిలదీస్తున్న భద్రాచలం ప్రజాప్రతినిధులు… ప్రతిపక్షాల నాయకుల నిర్బంధాలు… ఇలాంటి అస్తవ్యస్త పరిస్థితి నడుమ జరగాల్సిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటన శనివారం  భారీవర్షం కారణంగా రద్దయింది. భద్రాచలం ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం కురిసిన  భారీవర్షం కారణంగా, అప్పటికే బందోబస్తు  విధుల్లో నిమగ్నమైన మహిళా కానిస్టేబుల్ ఒకరు నాలాలో పడిపోయారు. ఆ తర్వాత అధికారులు గాలింపు చేపట్టగా ఆమె శవం లభించింది. భద్రాచలంలో మంత్రి కేటీఆర్, తదితరుల పర్యటనకు ఉన్నతాధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. భద్రాచలం పట్టణం పూర్తిగా పోలీసు నిఘాలో ఉంచారు. మంత్రి కేటీఆర్ భద్రాచలం వచ్చేముందే భారీవర్షం కురవడంతో భీభత్స వాతావరణం ఏర్పడి, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. భారీ వర్షం కారణంగా ఫ్లెక్సీలు, హోర్డింగులు పడి పోవడంతో విద్యుత్తు సరఫరాకు తీవ్రమైన  అంతరాయం కలిగింది. వర్షపునీటితో నిండి పోయిన భద్రాచలం పట్టణంలో రక్షణ లేని ఓ డ్రైనేజీని గుర్తించలేక బందోబస్తు విధుల కోసం కొత్తగూడెం నుంచి భద్రాచలం వచ్చిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి అందులో పడి గల్లంతయ్యారు. పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలించగా, ఆమె మృతదేహం ఆ ప్రాంతంలో ఓ నాలాలో లభ్యమైంది. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్, భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్, ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. అసలే వివాదాల నడుమ ఉద్రిక్త పరిస్థితులుండగా, భారీగా కురిసిన వర్షం, మంత్రి కేటీఆర్ పర్యటనకు ఆటంకం కలిగించడంతోపాటు, మహిళా హెడ్ కానిస్టేబుల్ రమాదేవి నిండు ప్రాణం బలిగొని, భద్రాద్రి పుణ్యక్షేత్రంలో విషాదం నింపింది.

Related posts

గత అధికారుల పాపాలు… వెంటాడుతున్న శాపాలు…

Divitimedia

అక్కాతమ్ముళ్లకు నేస్తం ట్రస్ట్ ఆర్థికసాయం

Divitimedia

ఏటీసీని పరిశీలించిన జిల్లా కలెక్టర్

Divitimedia

Leave a Comment