Divitimedia
Bhadradri KothagudemEducationTelangana

అన్ని సౌకర్యాలున్నా… ఆరుబయటే విద్యార్థులకు భోజనం

అన్ని సౌకర్యాలున్నా… ఆరుబయటే విద్యార్థులకు భోజనం

పాల్వంచ ఆశ్రమ పాఠశాల హెచ్ఎం, వార్డెన్ పై మండిపడిన ఐటీడీఏ పీఓ

✍🏽 దివిటీ మీడియా – పాల్వంచ

పాల్వంచలోని గిరిజన సంక్షేమశాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మిక తనిఖీచేసిన భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్, అన్ని సౌకర్యాలున్నా విద్యార్థులకు ఆరుబయట భోజనాలు ఏర్పాటు చేయడం పట్ల అధికారులపై మండిపడ్డారు. దీనిపై ఆ పాఠశాల హెచ్ఎం, వార్డెన్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాఠశాలలో తరగతి గదులు, డార్మెటరీలు, డైనింగ్ హాల్స్ ఉండగా పిల్లలు బయట కూర్చోబెట్టడంతో హెచ్చరించారు. పాఠశాల పరిసరాలను, తరగతి గదులను, డైనింగ్ హాల్, డార్మెటరీలను పరిశీలించారు.
వర్షాకాలం నడుస్తున్నందున వాతావరణం సరిగా లేని కారణంగా గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమపాఠశాలల్లో విద్యార్థులపై హెచ్ఎం, వార్డెన్లు, ఉపాధ్యాయులు, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీఓ ఆదేశించారు. గిరిజన విద్యార్థులకోసం అనేక సౌకర్యాలు కల్పించినప్పటికీ, సిబ్బంది అశ్రద్ధ కారణంగా పిల్లలకు సరైన వసతి కల్పించలేకపోతున్న దుస్థితి ఉందన్నారు. పిల్లల చదువు కోసం అనేక రకాల పుస్తకాలు, అభ్యాసికలు, నోట్ బుక్స్, సాధనపుస్తకాలు పంపిణీ చేసినా, వాటిని పిల్లలకు వినియోగించకుండా, స్టోర్ రూములో పడేసి ఉండటం చూసిన పీఓ, హెచ్ఎంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే గిరిజన సంక్షేమశాఖ డిడి మణెమ్మకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ, ఎచ్ డి ఓ పనితీరు సరిగా లేనందున, ఆయనకు షోకాజ్ నోటీస్ జారీ చేస్తూ, పర్యవేక్షణ సరిగా చేయాలని ఆదేశించారు. డిప్యూటీ వార్డెన్ ప్రమోద్ ను బదిలీ చేయాలని కూడా ఆదేశాలిచ్చారు. మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తితే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.ఈ సందర్భంగానే పాఠశాలలో పిల్లలతోపాటు భోజనం చేసి, ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనాలు అంద జేస్తున్నారా? లేదా? అని విద్యార్థులనడిగి తెలుసుకున్నారు. ఏ విధమైన సమస్యలు వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని, వారంరోజుల్లో తరగతి గదులు, బాత్రూములు, డైనింగ్ హాల్, డార్మెటరీ, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించి, విద్యార్థులకు ఆరుబయట కాకుండా లోపల భోజనంచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా దోమలు రాకుండా కిటికీలకు మెస్ వేయించాలని, ప్రతిరోజూ దోమలకు సంబంధించిన ఫాగింగ్ చేయించాలన్నారు. పిల్లల పట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, కఠినచర్యలతో పాటు అవసరమైతే శాఖా పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీఓ చంద్రమోహన్, ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు, డిప్యూటీ వార్డెన్ ప్రమోద్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్యార్థుల సామర్థ్యాలు సరిగ్గా అంచనా వేయాలి : ఐటీడీఏ పీఓ

Divitimedia

రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతను ప్రశంసించిన కలెక్టర్

Divitimedia

ఐటీసీ రోటరీక్లబ్ ఆధ్వర్యంలో బాలికకు సైకిల్ వితరణ

Divitimedia

Leave a Comment