‘ముక్తార్ పాషా, పైలా చంద్రక్కల అమరత్వం మహోన్నతం’
పీఓడబ్ల్యు జిల్లా నాయకురాలు ఆదిలక్ష్మి
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కృష్ణసాగర్ గ్రామపంచాయతీ పరిధిలోని నూతనంగా నిర్మించిన ‘చింత లక్ష్మీనగర్’ లో దివంగత విప్లవోద్యమ నాయకులు ముక్తార్ పాషా, పైలా చంద్రమ్మ వర్ధంతిసభ ఆదివారం నిర్వహించారు. ఆ సంఘం మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్థంతిసభలో
అధ్యక్షత వహించిన పెద్దగొని ఆదిలక్ష్మి మాట్లాడారు. ముక్తార్ పాషా చిన్నతనంలో విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితుడై తన ప్రాణం ఉన్నంతవరకు విప్లవోద్యమంలో పోరాడిన అమరుడని అన్నారు. పైలా చంద్రక్క తొలి తరం మహిళ, విప్లవ వీరనారి అని శ్రీకాకుళ ఉద్యమ ధ్రువతార అని తెలిపారు. వీరు ఇద్దరు మారుమూల గ్రామాల్లో పుట్టి విప్లవ రాజకీయాలకు అంకితమయ్యారన్నారు.
ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ చిన్నతనం నుంచి పేద ప్రజల కోసం తమ జీవితాలను మొత్తం త్యాగం చేసి అమరులయ్యారని, ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు నాగేశ్వరరావు, ఎల్ రవి, ఎస్ రవి, ఎస్ భూలక్ష్మి, ధనలక్ష్మి, సుజాత, రాధా, సంధ్యా, వెంకన్న, కొండలరావు, తదితరులు పాల్గొన్నారు.