Divitimedia
National NewsPoliticsSpot News

‘జమిలి ఎన్నికలపై’ హైలెవెల్ కమిటీ తొలి సమావేశం

‘జమిలి ఎన్నికలపై’ హైలెవెల్ కమిటీ తొలి సమావేశం

✍🏽 దివిటీ మీడియా – న్యూఢిల్లీ

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించి,తగిన సిఫార్సులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల (సెప్టెంబర్) 2వ తేదీన ఏర్పాటు చేసిన అత్యున్నత కమిటీ ప్రాథమిక సమావేశం, శనివారం (సెప్టెంబర్ 23) ఛైర్మన్, దేశ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సభ్యులుగా ఉన్న కేంద్ర హోం, సహకారశాఖల మంత్రి అమిత్ షా, న్యాయ శాఖమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, మాజీ ప్రతిపక్ష నాయకుడు(రాజ్యసభ) గులాంనబీ
ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్.కె సింగ్, లోక్ సభ మాజీ సెక్రటరీ జనరల్ డా.సుభాష్ సి కశ్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఈ సమావేశానికి హాజరయ్యారు. సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వర్చువల్ గా ఈ సమావేశంలో పాల్గొన్నారు. లోక్‌సభలో అతి పెద్ద పార్టీ ప్రతిపక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఈ సమావేశానికి హాజరు కాలేదు.
ఛైర్మన్ రామ్ నాధ్ కోవింద్ స్వాగతం పలికి కమిటీ సభ్యులకు సమావేశ ఎజెండాను వివరించారు. ఈ సందర్భంగా కమిటీ పని విధానాలను వివరిస్తూ, గుర్తింపు పొందిన జాతీయ రాజకీయపార్టీలు, రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని కలిగి ఉన్న రాజకీయ పార్టీలు, పార్లమెంటులో తమ ప్రతినిధులను కలిగి ఉన్న రాజకీయ పార్టీలు, ఇతర గుర్తింపు పొందిన రాష్ట్ర రాజకీయ పార్టీలను జమిలి ఎన్నికలపై సూచనలు, అభిప్రాయాలను తెలియజేసేందుకు ఆహ్వానించాలని కమిటీ నిర్ణయించింది. దేశంలో ఎన్నికల విధానం, జమిలి ఎన్నికలపై భారత ‘లా కమిషన్’ ను కూడా అభిప్రాయాలు, సూచనలు కోరాలని కమిటీ నిర్ణయించింది.

Related posts

భార్యపై కోపంతో 8ఏళ్ల కన్నకూతురిని చంపిన కసాయి తండ్రి

Divitimedia

వాహన ప్రమాదస్థలాల్లో దిద్దుబాటు చర్యలపై సమీక్ష

Divitimedia

పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితాలు ఖరారు

Divitimedia

Leave a Comment