Divitimedia
Spot News

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 ఉత్తమ పంచాయతీలకు సత్కారం

స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023 ఉత్తమ పంచాయతీలకు సత్కారం

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2023లో ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులు, కార్యదర్శులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధికారులు ఘనంగా సత్కరించారు. జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లాలో ఎంపికైన 15 గ్రామపంచాయతీల ప్రతినిధులను సత్కరించారు. అభివృద్ధిలో పోటీపడుతున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సిబ్బంది అందిస్తున్న సేవల వల్ల గ్రామాల ముఖచిత్రాలు మారుతున్నాయని, వీరంతా సమన్వయంతో మంచిగా పనిచేస్తున్నారని కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల అభినందనలు తెలియజేశారు. స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్ లో ఆరోగ్య పంచాయతీ విభాగంలో గౌతంపూర్ గ్రామపంచాయతీ, జల సంరక్షణ చర్యలలో జగన్నాథపురం గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో అవార్డులు సాధించాయన్నారు. అభివృద్ధి విషయంలో గ్రామపంచాయతీల్లో ఆరోగ్యకరమైన పోటీఉండాలని, ఆదర్శంగా తీసుకుని ఇతర గ్రామపంచాయతీలు కూడా అవార్డులు సాధించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ లో 481 గ్రామ పంచాయతీలలో జనాభాపరంగా మూడు విభాగాల్లో స్వచ్ఛ పంచాయతీలను ఎంపిక చేసినట్లు ఆమె వివరించారు. 2 వేలమంది కంటే తక్కువ, 2001నుంచి 5 వేలమంది వరకు, 5 వేలకు పైగా జనాభాగల పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, ఘన, ద్రవవ్యర్థాల నిర్వహణ, ఓడీఎఫ్ ప్లస్ లో సాధించిన ప్రగతి, తదితర అంశాలలో ‘విలేజ్ సెల్ఫ్ అసెస్మెంట్’ ద్వారా ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. గ్రామాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు, మురుగునీటి నిల్వలు లేకుండా, మురికికాలువలన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడటం, ఇలాంటి అంశాలపైనే ప్రజలకు అవగాహన కల్పించడం, స్వచ్ఛ భారత్ మిషన్, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ -2023 పై గ్రామాల్లో వాల్ పెయింటింగ్స్ వేసి ఉండడం వంటి అంశాలపై పరిశీలన బృందాలిచ్చిన నివేదికల ఆధారంగానే రాష్ట్రస్థాయిలో ఈ అవార్డులు సాధించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛత సేవా గోడపత్రికలు ఆవిష్కరించి, అనంతరం 15 ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులతోపాటు, ఆయా పంచాయతీలకు సంబంధించిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీడీఓలు, ఎంపీఓలు, కార్యదర్శులను శాలువాలు, ప్రశంసాపత్రాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ రాజు, జడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ రమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

డీఎస్సీ పరీక్షకేంద్రం వద్ద సెక్షన్ 163 సెక్షన్

Divitimedia

ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలు

Divitimedia

గ్రూప్ 2 పరీక్ష నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి

Divitimedia

Leave a Comment