విజయవాడలో విరిగిపడిన కనకదుర్గమ్మ కొండచరియలు
రోడ్డును క్లియర్ చేసే పనిలో నిమగ్నమైన అధికారులు
దివిటీ మీడియా – విజయవాడ
విజయవాడలో కనకదుర్గమ్మ దేవస్థానం సమీపంలో సోమవారం కొండచరియలు విరిగిపడ్డాయి. ఫ్లైఓవర్ పక్కనే కొండనుంచి మట్టి, రాళ్లు కిందకు జారిపడిపోయాయి. ఆ మట్టి, రాళ్లు రోడ్డు మీదకు జారిపోవడంతో ఆ రోడ్డులో ఓవైపు రాకపోకలకు అడ్డంకిగా మారి అంతరాయం కలిగింది. కనకదుర్గమ్మ ఆలయానికి కాస్త దూరంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పినట్లైంది. కొండచరియలు విరిగి పడిన సమాచారంతో అధికారులు ఆ ప్రాంతంలో పడిపోయిన మట్టి, రాళ్లు తొలగించే పనులు, సహాయక చర్యలు చేపట్టారు. జోరుగా వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అధికార యంత్రాంగం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.