బూర్గంపాడులో సీపీఎం నాయకుల నిరసన
✍🏽 దివిటీ మీడియా – బూర్గంపాడు
బూర్గంపాడు మండల కేంద్రంలో గురువారం సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఆ పార్టీ నాయకులు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వల్ల సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా పోతోందన్నారు. 2014లో రూ.410గా ఉన్న వంటగ్యాస్ ధర, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1250కు పెంచిందని తెలిపారు. కంటితుడుపు చర్యగా రూ.200 ధర తగ్గించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ఒకవేళ మళ్లీ అధికారంలోకి వస్తే రూ.2000వరకు పెంచే పరిస్థితి కూడా ఉంటుందన్నారు. దేశవ్యాప్తంగా తమ పార్టీ ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని ఇచ్చిన పిలుపులో భాగంగా బూర్గంపాడు మండలకేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పాపినేని సరోజిని, ఎస్కే అబీద, భయ్యా రాము, రాయల వెంకటేశ్వర్లు, బర్ల తిరపతయ్య, బోళ్ల ధర్మ, తదితరులు పాల్గొన్నారు.