Divitimedia
Bhadradri KothagudemLife StyleTelangana

ఆఫీస్ సబార్డినేట్ సేవలను అభినందించిన కలెక్టర్

ఆఫీస్ సబార్డినేట్ సేవలను అభినందించిన కలెక్టర్

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకలెక్టర్ కార్యాలయ సబార్డినేట్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన గోడె నరసింహారావు సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల తెలిపారు. గత నెల (ఆగస్టు) 31వ తేదీన ఉద్యోగ విరమణ చేసిన గోడె నరసింహారావు అభినందన సభ మంగళవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ డా ప్రియాంక నరసింహారావును శాలువాతో అభినందించారు. 1987 అక్టోబరులో రాత్రి కాపలాదారుగా రెవెన్యూశాఖలో విధుల్లో చేరిన నరసింహరావు 36 సంవత్సరాలు రెవెన్యూశాఖలో సుదీర్ఘంగా అమూల్యమైన సేవలందించారని కొనియాడారు. కలెక్టరేట్ లో విధులు నిర్వర్తిస్తూ పలువురు కలెక్టర్ల మన్ననలు పొందారని, వారి సేవలు చాలా విలువైననవని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, ఏఓ గన్యా, నాలుగో తరగతి ఉద్యోగుల అధ్యక్షుడు అజ్మీర రామ్ రవి, కన్యావతి, తాజుద్దీన్ మస్తాన్, వై నరసింహారావు, గౌతమ్, తదితరులు నరసింహారావుకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు కప్పి అభినందించారు.

Related posts

సీతారాం ఏచూరి మరణం సిపిఎం పార్టీకి తీరనిలోటు

Divitimedia

కేరళ, దక్షిణ తమిళనాడు, లక్షద్వీప్, అండమాన్-నికోబార్ దీవులకు ఉప్పెన హెచ్చరిక

Divitimedia

ఆన్ లైన్ ద్వారా ఎండీఎం బిల్లుల చెల్లింపులకు చర్యలు

Divitimedia

Leave a Comment