శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న ఐటీడీఏ పీఓ, కుటుంబసభ్యులు
✍🏽 దివిటీ మీడియా – భద్రాచలం
భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర స్వామి వారిని ఐటీడీఏ ప్రాజెక్టుఅధికారి ప్రతిక్ జైన్, ఆయన కుటుంబసభ్యులతోసహా శనివారం దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఐటీడీఏ పీవో కుటుంబ సభ్యులకు దేవస్థానం ఏఇఓ శ్రవణ్ కుమార్, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా బలిపీఠం వద్ద ప్రత్యేక దర్శనం చేయించారు. గర్భగుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మీతాయారమ్మ అమ్మవారిని, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చక స్వాములు స్వామివారి విశిష్టతను పీఓ కుటుంబసభ్యులకు తెలిపి, స్వామివారి పట్టు వస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు.