Divitimedia
Bhadradri KothagudemTelangana

వచ్చే నెలాఖరులోగా 108ఇళ్లు పంపిణీకి సిద్ధం చేయాలి

వచ్చే నెలాఖరులోగా 108ఇళ్లు పంపిణీకి సిద్ధం చేయాలి

రెండు పడక గదుల ఇళ్లు తనిఖీ చేసిన కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల

✍🏽 దివిటీ మీడియా – కొత్తగూడెం

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని పాత కొత్తగూడెంలో నిర్మాణంలోని రెండు పడక గదుల ఇళ్లను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకఅల బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సెప్టెంబర్ నెలాఖరులోగా అన్నిహంగులతో 108 ఇళ్లు పూర్తిచేసి అంద జేయాలని జిల్లాకలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారుల్ని ఆదేశించారు. ఈ ప్రాంతంలో మొత్తం 828 ఇళ్లు నిర్మిస్తున్నామని, వీటిలో 108 ఇళ్లు వచ్చే నెలాఖరు వరకు అన్ని హంగులతో మున్సిపాల్టీకి అప్పగించాలని చెప్పారు. అంతర్గత రహదారుల వెంబడి ఉన్న పిచ్చి మొక్కలు శుభ్రం చేయించాలని చెప్పారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు వెళ్లేందుకు వీలుగా సైడ్ కాలువలు నిర్మించాలన్నారు. చాలాపనులు పెండింగ్ ఉన్నాయని, పూర్తి చేసేందుకు తక్షణం ప్రారంబించడంతోపాటు ప్రత్యామ్నాయంగా పనులు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. విద్యుత్తు, మంచినీరు, వీధి దీపాలు ఏర్పాటు వంటి అన్ని సౌకర్యాలు పూర్తి చేసిన తర్వాతనే మున్సిపల్ అధికారులు ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి అప్పగించిన తర్వాత నిర్వహణ భాధ్యత మున్సిపాల్టీకి అప్పగించనున్నట్లు చెప్పారు. మంచినీటి పైపు లైన్లు ఏర్పాటులో ఎలాంటి లీకేజీలు ఉండకుండా చూడాలని చెప్పారు. ఇసుక కొరత తీర్చేందుకు మైనింగ్, టిఎస్ఎండిసి అధికారులను సంప్రదించాలని చెప్పారు. ఫ్లైయాష్ ప్రాధాన్యత మీద సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. ఇళ్ల బ్లాకులను పరిశీలించిన కలెక్టర్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టేలా అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మొక్క నాటిన కలెక్టర్ ఆ ప్రాంతంలో ఎక్కడా ఖాళీస్థలం ఉండటానికి వీల్లేకుండా చెట్లను నాటి ఆహ్లాదకరంగా తయారు చేయాలని చెప్పారు. మొక్కలు నాటడంతో పాటుగా పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతిరాజ్ ఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘు, కొత్తగూడెం ఆర్డీఓ శిరీష, స్థానిక తహసిల్దార్ పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముక్కోటిఏకాదశి ఉత్సవాలకు సర్వం సిద్ధం

Divitimedia

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు పకడ్బందీగా పరిశీలించాలి

Divitimedia

‘సఖి’ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనం ప్రారంభం

Divitimedia

Leave a Comment