బ్రిలియంట్ లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
✍🏽 దివిటీ మీడియా – సారపాక
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థలో మంగళవారం గిడుగు వెంకటరామమూర్తి జయంతి పురస్కరించుకొని తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తెలుగు భాష ప్రాముఖ్యత గురించి వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలు పొందిన విద్యార్థులకు బ్రిలియంట్ విద్యా సంస్థల చైర్మన్ బి నాగేశ్వరరావు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అంద జేశారు. అనంతరం తెలుగుభాషదినోత్సవం పురస్కరించుకొని బ్రిలియంట్ విద్యాసంస్థల ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారి భాష గొప్పతనాన్ని వివరించారు. మన మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకున్నప్పటికీ మన అమ్మ భాష అయినటువంటి తెలుగు భాషను గౌరవించడం మనందరి బాధ్యతని తెలియజేశారు. ఈ సందర్భంగా బ్రిలియంట్ విద్యాసంస్థల తరపున తెలుగు ఉపాధ్యాయురాలు హరితారెడ్డిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో బ్రిలియంట్ విద్యాసంస్థల చైర్మన్ బి నాగేశ్వరరావుతోపాటు ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణకుమారి, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.