సీఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో ‘వెటరన్స్ ర్యాలీ’
✍🏽 దివిటీ మీడియా – హైదరాబాదు
హైదరాబాదు బార్కాస్ చాంద్రాయణగుట్ట ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ గ్రూప్ సెంటర్ లో ఆదివారం వెటరన్స్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో దాదాపు 175 నుంచి 200 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు పాల్గొన్నారు. ర్యాలీలో భాగంగా మాజీ సైనికులను హైదరాబాదు లో చార్మినార్ సందర్శనకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా చార్మినార్‌లో వారికి ఫొటోలు తీసుకునే అవకాశం కూడా కల్పించారు. ఈ ర్యాలీ సందర్భంగా, హైదరాబాద్‌లోని కాంపోజిట్ హాస్పిటల్ సీఆర్పీఎఫ్ వైద్యులు ఉచిత వైద్య సలహాలు అందించారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించే లక్ష్యంతో ‘ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే వెటరన్స్ కు వర్తించే ఆర్థిక ప్రయోజనాలు, ఇతర అవకాశాలను పొందేలా అవగాహన కల్పించేలా ‘పవర్ పాయింట్ ప్రజెంటేషన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుజోయ్ లాల్ థాసేన్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన వెటరన్ అసోసియేషన్ సభ్యులతోపాటు మాజీ సైనికులతో కూడా సంభాషించారు.