ప్రగతి స్కూల్లో ఘనంగా ‘ఎల్లో కలర్ డే’…
✍🏽 దివిటీ మీడియా – సారపాక
సారపాక ప్రగతి స్కూల్లో శనివారం ‘ఎల్లో కలర్స్ డే’ వేడుకలను విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రగతి విద్యానికేతన్ స్కూల్ కరస్పాన్డెంట్ సానికొమ్ము బ్రహ్మారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు అనేది సూర్యునికి సంబంధించిన రంగు అని తెలిపారు. ఇది ఆశావాదం, శక్తి, ఆనందం, స్నేహాన్ని కూడా సూచిస్తుందని పేర్కొన్నారు. తెలివితేటలకు కూడా ఇది నిలబడగలదన్నారు. దీనికి విరుద్ధంగా, పసుపు అసూయ, అనారోగ్యం, ద్రోహం కోణం, ప్రమాదాన్ని సూచిస్తుందని తెలిపారు. పసుపు ఆహారంతో బలమైన సంబంధం కలిగి ఉంటుందని, తరచుగా ఉత్సాహభరితమైన భావాలు రేకెత్తిస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా
‘ఎల్లో కలర్ డే’ను సూచించేలా విద్యార్థులు అంతా పసుపు రంగు దుస్తులు ధరించారు. పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ,
ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లితండ్రులు పాల్గొన్నారు.