ఓటరు జాబితాలో ఓటు పరిశీలించుకోండి : కలెక్టర్ డా.ప్రియాంకఅల
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో తమ ఓటును పరిశీలించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంకఅల శుక్రవారం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో ఈ నెల 26న శనివారం, 27న ఆదివారం 1095 పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా పరిశీలనకోసం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ అధికారులు అందుబాటులో ఉండే ఏర్పాట్లు చేశామని, ఓటర్లు అందరూ తప్పనిసరిగా తమ పేరు పరిశీలించుకోవాలని ఆమె పేర్కొన్నారు. ఓటరు జాబితాలో ఏవైనా తప్పు నమోదు కానీ మార్పులు చేర్పులేమైనా కానీ ఉంటే సంబంధిత అధికారులను సంప్రదించి నిర్దేశిత ఫారాల్లో దరఖాస్తు చేయాలన్నారు. సలహాలు, సూచనల కోసం బూత్ స్థాయి అధికారులనడిగి తెలుసుకోవాలని, అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఈ పరిశీలన కార్యక్రమంలో బాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం అక్టోబర్ 1వ తేదీ నాటికి 18సంవత్సరాలు నిండే వారందరూ ఓటరుగా నమోదు చేసు కోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.