ఓటరు జాబితాలో మీ ఓటు ఉందో, లేదో చూసుకోండి…
అభ్యంతరాల నమోదుకు సెప్టెంబర్ 19 తుది గడువు
✍🏽 దివిటీ మీడియా – భద్రాద్రి కొత్తగూడెం
ముసాయిదా ఓటర్ల జాబితాను సోమవారం ప్రకటించిన నేపథ్యంలో, ఆ ముసాయిదా ఓటరు జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 19లోగా తెలియజేయాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లాకలెక్టర్ డా.ప్రియాంక సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సోమవారం జిల్లాలో ఐదు నియోజకవర్గాల ఓటర్ల వివరాలు వెల్లడించారు. కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, భద్రాచలం నియోజకవర్గాల్లో 928983 మంది ఓటర్లున్నట్లు ఆమె చెప్పారు. వీరిలో పురుషులు 454286 మంది, స్త్రీలు 474663 మంది, థర్డ్ జండర్స్ 34 మంది, ఎన్నారైలు 42 మంది, సర్వీస్ ఓటర్లు 731 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
ముసాయిదా ఓటరుజాబితా ప్రతి ఓటరు పరిశీలించి అభ్యంతరాలు, తప్పొప్పుల సవరణ, లిస్టులో ఉన్నవారి పేర్లపై ఏమైనా ఆక్షేపణలుంటే తెలపడానికి సెప్టెంబర్ 19 వరకు గడువు ఇచ్చినట్లు వెల్లడించారు. నిర్దేశించిన గడువులోగా వచ్చిన ఆక్షేపణల మీద విచారణ నిర్వహించి సెప్టెంబర్ 28 వరకు పూర్తిచేసిన తుది ఓటరు జాబితాను అక్టోబర్ 4న ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. సోమవారం విడుదల చేసిన ముసాయిదా ఓటరుజాబితాను పరిశీలించి
నూతన ఓటరు నమోదు కోసం ఫారం-6, తప్పొప్పుల సవరణకోసం ఫారం-8, ఓటరు జాబితాలో పేర్లపై ఆక్షేపణలు, వలస వెళ్లిన, మరణించిన వారి వివరాలు తెలపడానికి ఫారం-7 ను వినియోగించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాలు