సంస్కృతి పరిరక్షణలో ఆదివాసీలది ప్రత్యేకస్థానం : ఎమ్మెల్యే తెల్లం
గిరిజన సంక్షేమానికి కృషిచేస్తున్నాం : ఐటీడీఏ పీఓ






భద్రాచలంలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు
✍️ దివిటీ మీడియా (కొత్తగూడెం)
తమ సంస్కృతి సంప్రదాయాలను పరి రక్షించుకోవడంలో ప్రత్యేక స్థానం కలిగిన ఆదివాసీ గిరిజనులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కూడా సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, పలువురు ఆదివాసీ నేతలు కోరారు. భద్రాచలంలలో ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ప్రపంచ ఆదివాసీదినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ముఖ్య అతిథిగా పలువురు అతిథులతో పాటు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనచేసి మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కొండలు కోనల్లో నివసించే ఆదివాసీ గిరిజనులు నాగరికత, సంస్కృతి సాంప్రదాయాలను పాటించడంలో ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానమున్న ఆదివాసులను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అల్లూరి సీతారామ రాజు, గంటందొర, మల్లుదొర, కొమురం భీమ్ వంటి ఆదివాసీ నాయకుల ప్రాణ త్యాగాల ఫలితంగా అభివృద్ధిదిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మన ఆదివాసీ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం, భద్రాచలం ఐటీడీఏ కృషిచేస్తోందని, పీఓ రాహుల్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మరింత చేయూతనందిస్తున్నారని కొనియాడారు. విద్య,వైద్య, వ్యవసాయ, మౌలిక వసతుల కల్పనకు ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ మాట్లాడుతూ, తన హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఐటీడీఏ సంక్షేమపథకాల అమలు సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. వేడుకల
ముందు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పీఓ రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి స్థానిక అంబేద్కర్ కూడలి వద్ద ఆదివాసీ అమర వీరుల విగ్రహాలకు పూలమాలలువేసి, ఆదివాసీ గేయం, ప్రతిజ్ఞతో ఆదివాసీ జెండా ఆవిష్కరించి వారికి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం గిరిజనభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజనుల సంక్షేమానికి విశేష కృషిచేస్తున్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, ఏపీఓ డేవిడ్ రాజ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని గిరిజన ఐక్యవేదిక కార్యాచరణ సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ చందన,ఏఓ సున్నం రాంబాబు, ఏసీఎంఓ రమేష్, ఏటీడీఓ రాధమ్మ, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ మధుకర్, గురుకులం ఆర్సీఓ అరుణ కుమారి, జీసీసీ డీఎం సమ్మయ్య, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, ఏపీఓ వేణు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణదొర, గిరిజన సంఘాల నాయకులు పాయం రవివర్మ, శరత్ బాబు, మురళి, రమేష్, పుల్లయ్య, వీరస్వామి, కుంజా ధర్మా, సుధారాణి, అరుణ, వెంకటరావు, వీరభద్రం, వివిధ గ్రామాలకు చెందిన గిరిజనసంఘాల నాయకులు, పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

















































Save or share this story as a newspaper-style Epaper Clip:

