Divitimedia
Andhra PradeshEducationHealthLife StylePoliticsPRAKASAMSpot NewsWELFAREWomen

సంతమాగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి పర్యటన

సంతమాగులూరు మండలంలో మంత్రి గొట్టిపాటి పర్యటన

✍️ దివిటీ మీడియా (ప్రకాశం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన(విద్యుత్తు) శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన సొంత అద్దంకి నియోజకవర్గపర్యటనలో భాగంగా సోమవారం సంతమాగులూరు మండలంలో పర్యటించారు. ఏల్చూరు గ్రామంలో రూ.2.5కోట్ల వ్యయంతో నిర్మించిన ఏల్చూరు – సజ్జాపురం బీటీ రహదారిని ప్రారంభించారు. ఈ నూతన రహదారి నిర్మాణంతో ఉభయ గ్రామాల మధ్య ప్రయాణం అత్యంత సులభతరం, వేగవంతం కానుందని మంత్రి తెలిపారు. ప్రజావసరాలే ప్రాధాన్యంగా, మెరుగైన మౌలిక వసతులు కల్పించి గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి బాటలు వేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. ఏల్చూరు
గ్రామంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయంలో రూ.1.6కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు వసతి గదుల భవనం ప్రారంభించారు. అక్కడ విద్యాబోధన, భోజనం నాణ్యత, ఇతర వసతుల గురించి తెలుసుకున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దిశా నిర్దేశంలో రాష్ట్రంలోని కేజీబీవీల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఏల్చూరు లో 67 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.77,03,685 చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్టీ కాలనీలో 93 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మరో 30 మందికి త్వరలోనే పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు.

ఇంటింటి ప్రచారం ప్రారంభించిన మంత్రి
———————
ఈ పర్యటనలో భాగంగానే ఏల్చూరు గ్రామంలో కూటమి ప్రభుత్వం “రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, సంక్షేమం” ఇంటింటి ప్రచారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి, ప్రజలను పలకరిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్లలో సాధించిన విజయాలగురించి వివరించారు. తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ManaAddanki #CMRF #GottipatiRavikumar #ChandrababuNaidu

Related posts

గణేష్ నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తి : ఎస్పీ డా.వినీత్

Divitimedia

తెలంగాణ సౌత్ జోన్ సబ్ జూనియర్ బాలుర హాకీజట్టు కోచ్ గా నిఖిల్

Divitimedia

ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుక

Divitimedia

Leave a Comment