Divitimedia
Bhadradri KothagudemBusinessHyderabadLife StyleSpot NewsTelanganaTravel And Tourism

ఆయన నిజాయితీ అందరికీ స్ఫూర్తి….

ఆయన నిజాయితీ అందరికీ స్ఫూర్తి….

రివార్డుతో సత్కరించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్

✍️ మణుగూరు, హైదరాబాద్ – దివిటీ (జూన్ 5)

ఓ సాధారణ ఆర్టీసీ డ్రైవర్ అసాధారణమైన మంచి పని చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు… ఆయన చేసిన పనికి మెచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రివార్డు అందజేసి మరీ సత్కరించారు… స్పూర్తిదాయకమైన ఆ వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ మహేష్ మే 28న అమలాపురం డ్యూటీకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఆ బస్సులో ఓ వ్యక్తికి చెందిన రూ.లక్ష పడిపోయాయి. ఆ డబ్బు బస్సు డ్రైవర్ మహేష్ కు దొరికాయి. నిజాయితీతో నిస్వార్ధంగా వ్యవహరించిన మహేష్ ఆ డబ్బును పర్సులోని వివరాల ప్రకారం బాధితులకు అందించారు. రూ.100 దొరికితేనే గప్ చిప్ గా ఎవరికీ తెలియకుండా దాచుకునే ఈ రోజుల్లో డ్రైవర్ మహేష్ నిజాయితీ, నిబద్ధతను గుర్తించిన ఆర్టీసీ అధికారులు ఆయనకు రాష్ట్ర ఆర్టీసీసేవా రివార్డు ప్రకటించారు. హైదరాబాదులోని ఆర్టీసీ భవన్ లో గురువారం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా మహేష్ కు ఆ రివార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా డ్రైవర్ మహేష్ పై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related posts

భద్రాచలం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన మంగీలాల్

Divitimedia

కిలారు కుటుంబంచే శీతల శవపేటిక వితరణ

Divitimedia

మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మరో కొరియర్ అరెస్ట్

Divitimedia

Leave a Comment