Divitimedia
Bhadradri KothagudemBusinessEducationLife StyleSpot NewsTelanganaWomen

ఆర్థిక అవగాహన, లక్ష్యాలతో ముందుకెళ్లాలి

ఆర్థిక అవగాహన, లక్ష్యాలతో ముందుకెళ్లాలి

మహిళలకు ఆర్బీఐ మేనేజర్ సాయితేజరెడ్డి సూచన

✍️ గుండాల – దివిటీ (ఏప్రిల్ 25)

స్వయం సహాయక సంఘాల సభ్యులు స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు నిర్దేశించుకుని, ఆర్థికంగా అవగాహనతో ముందుకు సాగాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మేనేజర్ సాయితేజరెడ్డి సూచించారు. ఆస్పిరేషనల్ బ్లాకుగా గుర్తించిన గుండాల మండలంలోని కాచనపల్లిలో శుక్రవారం మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆర్థిక ప్రణాళిక, పొదుపు, వివిధ రకాల పెట్టుబడి సాధనాలు, బ్యాంకు లావాదేవీలు, బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్, ఆన్లైన్ మోసాల నుంచి రక్షణ, స్వయంఉపాధి పథకాల సద్వినియోగం, తదితర అంశాలపై ఈ సమావేశంలో మహిళలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, ఎస్బీఐ కాచనపల్లి మేనేజర్ వేణు, ఐకేపీ ఏపీఎం కోటేశ్వరరావు, సీసీలు, సి.ఎఫ్.ఎల్ కౌన్సిలర్లు నాగేశ్వరరావు, జగ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్ట్ టైం అధ్యాపకులుగా పనిచేసేందుకు దరఖాస్తుల ఆహ్వానం

Divitimedia

ఐటీసీలో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా

Divitimedia

మూడు దశాబ్దాల తర్వాత కలిసిన ఆనాటి సహ విద్యార్థులు

Divitimedia

Leave a Comment